London, April 1st, 2025: UKలో ఒక Bank లేదా Building Society దివాళా తీసిన సందర్భంలో పొదుపుదారులు (Depositors) Depositsను £110,000 వరకు రక్షించేందుకు Bank of England కొత్త ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం £85,000గా ఉన్న రక్షణ పరిమితిని సుమారు 30% పెంచే ఈ నిర్ణయం, 2008 Banking Crisis తర్వాత పొదుపుదారులు (Depositors) రక్షణ Schemeలో జరిగిన తొలి ప్రధాన సవరణగా నిలవనుంది.
ఈ పెంపుదల Inflationను పరిగణనలోకి తీసుకుని, Consumersకు తమ డబ్బు సురక్షితంగా ఉందనే నమ్మకాన్ని కలిగించే లక్ష్యంతో తీసుకున్న చర్యగా Prudential Regulation Authority (PRA) పేర్కొంది.
PRA Chief Executive Sam Woods మాట్లాడుతూ, “మా ఆర్థిక వ్యవస్థపై ప్రజల విశ్వాసం ఆర్థిక వృద్ధికి కీలకం. Banks, Building Societies, Credit Unionsపై నమ్మకాన్ని పెంచేందుకు రక్షణ పరిమితిని £110,000కు పెంచుతున్నాము. దీనివల్ల పొదుపుదారులు (Depositors) డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుందని నమ్మకం కలుగుతుంది,” అని వివరించారు.
Financial Services Compensation Scheme (FSCS) ద్వారా సాధారణ ఖాతాదారులు మరియు చిన్న వ్యాపారాలు తమ Depositsకు రక్షణ పొందుతాయి. ఈ Scheme 2001లో ప్రారంభమై, 2008 Financial Crisis తర్వాత పెద్ద ఎత్తున మార్పులకు లోనైంది. 2010లో £85,000 పరిమితి అమల్లోకి వచ్చింది. అయితే, Brexit తర్వాత UK ఇప్పుడు స్వతంత్రంగా ఈ పరిమితిని నిర్ణయించుకునే అవకాశం పొందింది.
ఈ కొత్త ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం పొందితే, 2025 December 1 నుండి సాధారణ మరియు SME ఖాతాదారుల పొదుపులకు ఈ కొత్త పరిమితి వర్తింపజేయనున్నారు.
2023లో Silicon Valley Bank (SVB) మరియు Credit Suisse వంటి Banks దివాళా సమస్యల తర్వాత, Deposit రక్షణ స్థాయిని పెంచాల్సిన అవసరం మరింత స్పష్టమైంది. అమెరికాలో $250,000 (£193,000) వరకు రక్షణ ఉంటే, UKలో ఈ పరిమితి తక్కువగా ఉండటంపై చర్చలు జరిగాయి.
Bank of England ఒక ప్రకటనలో, “2023లో Banking రంగంలో జరిగిన పరిణామాలు Deposit రక్షణ ప్రాముఖ్యతను స్పష్టం చేశాయి. Banking వైఫల్యాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ రక్షణ వ్యవస్థ రూపొందించబడింది,” అని తెలిపింది.