Saturday, 21 March 2026

అమెరికాలో 6000 మందికి విద్యార్ధి వీసాలు రద్దు

అమెరికాలో చట్టాలను ఉల్లంఘించిన కారణంగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను (USA Visa) రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ బీబీసీకి తెలిపింది. ఈ వీసాల్లో దాదాపు 4,000 వీసాలు దేశ చట్టాలను ఉల్లంఘించడం, దాడులు, మత్తులో డ్రైవింగ్ (DUI), దోపిడీ వంటి నేరాల కారణంగా రద్దయ్యాయి. అలాగే, ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనలిటీ యాక్ట్ (INA 3B) కింద ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి 200-300 వీసాలు రద్దు చేయబడ్డాయి, ఇందులో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేసిన విద్యార్థులను ట్రంప్ పరిపాలన యాంటీసెమిటిజం (యూదులపై వ్యతిరేకత)గా ఆరోపిస్తూ లక్ష్యంగా చేసుకుంది. ఈ చర్యలు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో వెలుగులోకి వచ్చాయి.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికా ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని కఠిన విధానాలు అమలు చేశారు, ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. జనవరిలో యాంటీసెమిటిజంను అరికట్టే బిల్లు ఆమోదించబడింది. దీని ప్రకారం పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేసే విద్యార్థులను దేశ బహిష్కరణకు గురిచేయవచ్చు. జూన్‌లో విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసి, తిరిగి ప్రారంభించినప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్‌ను కఠినతరం చేశారు. విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, వాటిలోని పోస్టులు, కామెంట్లు, లైక్‌లను అధికారులు పరిశీలించి, జాతీయ భద్రతకు ముప్పు లేనట్లయితేనే వీసా ప్రక్రియను కొనసాగిస్తారు.

అలాగే, కీలక విశ్వవిద్యాలయాలకు పరిశోధన నిధుల కోత విధించారు. పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న చాలామంది విద్యార్థులను అరెస్టు చేయించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థుల నియామకాలను నిషేధించడంతో ట్రంప్ పరిపాలనతో న్యాయపోరాటం ప్రారంభమైంది. 2023-24 విద్యాసంవత్సరంలో 1.1 మిలియన్ల మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారని, వారి ద్వారా 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని NAFSA అసోసియేషన్ తెలిపింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు