ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా 2025 ఆగస్టు 15న జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో జీప్ వేగనీర్ అనే పాత కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కారు భారత్-భూటాన్ మధ్య స్నేహ బంధానికి చిహ్నంగా నిలుస్తూ, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
1965లో భూటాన్ రాజు అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఈ జీప్ వేగనీర్ను బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు గుర్తుగా నిలిచింది. 2000 సంవత్సరంలో ఈ కారును అధికారికంగా భారత సైన్యానికి అప్పగించారు. ప్రస్తుతం ఇది న్యూదిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంది. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) సేవలకు ఉపయోగించబడుతోంది.
ప్రతి సంవత్సరం ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ జీప్ వేగనీర్ పాల్గొంటుంది. అత్యాధునిక వాహనాల మధ్య ఈ పాత కారు చారిత్రక, దౌత్య ప్రాముఖ్యతతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జీప్ వేగనీర్ 1962-1991 మధ్య తయారు చేయబడింది. అప్పట్లో దీనిని ‘స్టేషన్ వాగన్’గా పిలిచేవారు.


