Friday, 7 August 2026

హైద్రాబాద్ లో పెట్టుబడి స్కీమ్ ల పేరిట బడా మోసం

పెట్టుబడి స్కీముల పేరిట 200 మంది బాధితుల నుంచి రూ.14 కోట్లు వసూలు చేసి, రిటర్న్స్ ఇవ్వకుండా మోసం చేసిన వెలివిజల్రూస్ఆఫ్ కంపెనీ చైర్మన్ కందుల శ్రీనివాసరావును సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస్ రావు(44) హైదరాబాద్ లోని గోకుల్ ప్లాట్స్ వెంకట రమణ కాలనీలో వెలివిజన్ గ్రూప్ ఆఫ్ పేరిటకంపెనీ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్ గా ఉన్నాడు. ఇతని భార్య డైరెక్టర్ గా కొనసాగుతుంది. తన కంపెనీలో ఉన్న వివిధ స్కీముల్లో పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తానని సోషల్ మీడియా, ఇతర సామాజిన మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.

స్కీమ్-1లో.. ఒక వ్యక్తి లక్ష డిపాజిటే చేస్తే 100 రోజుల పాటు రోజుకి రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ప్రకటించాడు. స్కీమ్-2లో.. లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.20 వేల చొప్పున పది నెలల పాటు చెల్లిస్తామని, స్కీమ్-3లో రూ.6.50 లక్షలు డిపాజిట్ చేస్తే నగర శివారులో 121 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్చేస్తామని, ఆ తర్వాత 20 నెలల పాటు నెలకు రూ.32,500 ఇస్తామని ప్రకటించారు.

దీని కోసం ఎంఓయూతో పాటు చెక్కులు కూడా చెల్లిస్తామని తెలిపారు. స్కీమ్-4లో వెస్ విజన్ హోం అప్లయన్సెస్ లో టీవీ, వాషింగ్మి షన్, ఏసీ వంటి వస్తువులు కొనుగోలు చేస్తే వస్తువు ధరను ప్రతి నెల తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇలా ప్రతి స్కీమ్ లో రూ.10 వేల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని తెలిపారు. అయితే, ఈ స్కీమ్ గురించి తెలుసుకున్న రాజేంద్రనగర్ అత్తాపూర్ కు చెందిన ఝాన్సీ స్కీమ్ -1,2లలో పెట్టుబడులు పెట్టింది. అయితే, నెలలు గడిచినా రిటర్న్స్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు శ్రీనివాస్ రావును మంగళవారం అరెస్ట్చే శారు. నిందితుడు వివిధ స్కీమ్ల పేరుతో 200 మంది నుంచి రూ. 14 కోట్లు వసూల్ చేసినట్లు గుర్తించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు