Friday, 7 August 2026

బాలీవుడ్‌ని వ‌దిలిపెట్టిన అనురాగ్ క‌శ్య‌ప్ (Anurag Kashyap)…

బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ (Anurag Kashyap) హిందీ సినీ పరిశ్ర‌మ‌ను వీడిన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. ఈ మధ్య ఒక ఇంట‌ర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. నేను బాలీవుడ్‌ని విడిచి వెళ్లాలి అనుకుంటున్న. బాలీవుడ్ పరిశ్ర‌మ ప్ర‌స్తుతం (టాక్సిక్‌) విషవాతావ‌ర‌ణంతో నిండి పోయింది. అందుకే ఇక్క‌డ నుంచి సౌత్ ఇండ‌స్ట్రీకి వెళుతున్నాను. ఇక్క‌డ క్రియేటివిటీని ఎవ‌రు ప‌ట్టించుకోవ‌ట్లేదు. అంద‌రికి రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లు వ‌చ్చే సినిమాలు కావాలి. అందుకే క్రియేటివిటీకి విలువ లేకుండా పోయింది.

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వ‌డంతో పాటు క‌థ‌ల‌కు ప్రాధ‌న్య‌త‌ను ఇవ్వ‌డం, సినిమాను సినిమాలా తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంద‌ని తెలిపాడు. ఇక అనురాగ్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరు షిప్ట్ అయిన‌ట్లు తెలుస్తుంది. సినిమా విషయాల‌కు వ‌స్తే.. ఇటీవ‌ల మ‌ళ‌యాళం సినిమా రైఫిల్ క్ల‌బ్ (Rifle Club) సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించాడు అనురాగ్. ప్ర‌స్తుతం తెలుగులో డెకాయిట్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. అడివి శేషు హీరోగా వ‌స్తున్న ఈ చిత్రంలో మృణాల్ థాకుర్ క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు