బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) హిందీ సినీ పరిశ్రమను వీడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. నేను బాలీవుడ్‌ని విడిచి వెళ్లాలి అనుకుంటున్న. బాలీవుడ్ పరిశ్రమ ప్రస్తుతం (టాక్సిక్) విషవాతావరణంతో నిండి పోయింది. అందుకే ఇక్కడ నుంచి సౌత్ ఇండస్ట్రీకి వెళుతున్నాను. ఇక్కడ క్రియేటివిటీని ఎవరు పట్టించుకోవట్లేదు. అందరికి రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లు వచ్చే సినిమాలు కావాలి. అందుకే క్రియేటివిటీకి విలువ లేకుండా పోయింది.
సౌత్ సినీ ఇండస్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వడంతో పాటు కథలకు ప్రాధన్యతను ఇవ్వడం, సినిమాను సినిమాలా తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఇక అనురాగ్ ప్రస్తుతం బెంగళూరు షిప్ట్ అయినట్లు తెలుస్తుంది. సినిమా విషయాలకు వస్తే.. ఇటీవల మళయాళం సినిమా రైఫిల్ క్లబ్ (Rifle Club) సినిమాలో కీలక పాత్రలో నటించాడు అనురాగ్. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అడివి శేషు హీరోగా వస్తున్న ఈ చిత్రంలో మృణాల్ థాకుర్ కథనాయికగా నటిస్తుంది.


