థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మార్చి 28, 2025న భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:25 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.5 నుంచి 5.0 తీవ్రతతో నమోదైనట్లు సమాచారం. ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో బ్యాంకాక్ నగరంలోని ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినవారు వీధుల్లో గుమిగూడారు. అయితే, ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు ఇప్పటివరకు అధికారిక నివేదికలు రాలేదు.
బ్యాంకాక్ లాంటి జనసంద్రం ఎక్కువగా ఉండే నగరంలో భూకంపం సంభవించడం అరుదైన విషయం. థాయ్‌లాండ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంపకేంద్రాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలిక వల్ల సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. థాయ్‌లాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మయన్మార్‌లో శుక్రవారం (మార్చి 28) భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు “United States Geological Survey” (USGS) తెలిపింది. మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఈ భూకంప ప్రకంపనలు 5 నిమిషాలకుపైగా కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకాక్‌లో కూడా కంపించిన భూమి. ఇక్కడ భూకంప తీవ్రత 7.3గా నమోదు. భూకంపం తీవ్రత కారణంగా భవనాలు కుప్పకూలాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రెండు సార్లు భూకంపాలు ఒకదాని తర్వాత ఒకటి చోటుచేసుకోవడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.