Friday, 7 August 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇఫ్తార్ విందులను బహిష్కరిస్తున్న ముస్లిములు

ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇస్తున్న ఇఫ్తార్ విందు బహిష్కరణలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజయవాడతో పాటు పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలు, ఉద్యమం చేపట్టాయి. నిన్న శుక్రవారం మసీదులకు నల్ల రిబ్బన్లతో హాజరై నిరసన తెలపాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు సఫలమైంది.

ఈ సందర్భంగా, ఏలూరులో గిరిజన భవనంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు హాజరుకాలేదు. జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్, TDP నాయకులు అక్బర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డ్‌లో కేంద్రప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించరని, అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించినట్లు కలెక్టర్ వెట్రి సెల్వికి తెలిపారు. ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి తాము 10 మంది వచ్చామని చెప్పారు.

కేంద్రం పార్లమెంట్‌లో తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు NDA మిత్రపక్షం, TDP మద్దతు చేస్తున్నందుకు నిరసనగా, అఖిల భారత ముస్లిం లా బోర్డు పిలుపు మేరకు ఎక్కడికక్కడ ఇఫ్తార్ విందుల్ని ముస్లింలు బహిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతీ జిల్లాకేంద్రాల్లోనూ రంజాన్ సందర్భంగా ఇస్తున్న ఇఫ్తార్ విందులు ముస్లింలు రాక వెలవెలబోతున్నాయి. దీంతో TDPకి చెందిన ముస్లిం నేతలు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు