Friday, 7 August 2026

334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసిన భూకంపం

మయన్మార్ తో పాటు థాయిలాండ్ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ దేశాలకు అంతులేని శోకాన్ని, నష్టాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని థాయిలాండ్ కి చెందిన జియోలొజిస్ట్ జెస్ ఫీనిక్స్ అన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు నెలల తరబడి వచ్చే అవకాశం వున్నదని ఆమె అన్నారు.

కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడి పూర్తి పరిస్థితుల్ని బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. Earth Surface కి 10Km లోతులో ప్రకంపన కేంద్రాలు వున్నాయని United States Geological Survey తెలిపింది. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య పది వేలు దాటే అవకాశం వుందని ఆ సంస్థ వెల్లడించింది. అయితే మయన్మార్ సైనిక ప్రభుత్వం మాత్రం 1,600 మందికి పైగా మాత్రమే విపత్తు కారణంగా మరణించినట్లు ప్రకటించింది. కాగా దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం విపత్తు కలగచేసే నష్టం మరింత తీవ్రతరం కావచ్చు.

ఈ కష్ట సమయంలో మయన్మార్ ప్రజలను ఆదుకునేందుకు భారత్ “అపరేషన్ బ్రహ్మ” పేరుతో 15 టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపింది. ఇందులో ఆహార పదార్ధాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బాగ్స్, వాటర్ ప్యూరిఫైర్లు, సోలార్ లాంప్స్, జనరేటర్లు, అత్యవసర వైద్యపరికరాలు వున్నాయి. ఆ దేశంలో విపత్తు నిర్వహణ కోసం 80 మంది NDRF సిబ్బందిని అక్కడికి పంపనున్నది. ఇండోనేషియా, చైనా, అమెరికా దేశాలతో పాటు UNO కూడా సహాయక సామాగ్రిని పంపనున్నట్లు ప్రకటించాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు