Saturday, 8 August 2026

తెలంగాణలో మరో ఎయిర్ పోర్ట్ కు కేంద్రం అనుమతులు

ఆదిలాబాద్ ప్రజల కల త్వరలో నెరవేరనుంది.
రక్షణ శాఖ ఆధ్వర్యంలోని విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాయుసేన శిక్షణ సంస్థతో పాటు పౌర విమాన సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజ్‌నాథ్ సింగ్ కీలక లేఖ రాశారు. ఆ లేఖలో ఆదిలాబాద్ విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఈ క్రమంలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ, రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గానూ, ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

కిషన్ రెడ్డి గతంలో రాజ్‌నాథ్ సింగ్‌కు ఒక లేఖ రాశారు, ఆ లేఖలో ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజల కోసం ఉపయోగించాలని కోరారు. దీనిపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీనితోపాటు పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గతంలో తాను ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాశానని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని ఆయన విమర్శించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు