Friday, 7 August 2026

కొత్తూరు SI, CI లను తక్షణమే suspend చేయాలి

నేర విచారణలో భాగంగా సీజ్ చేయబడిన laptop ను విధిగా సంబదిత కోర్ట్ లో సమర్పించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి సంభదిత laptop ను వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్న కొత్తూరు పోలీస్ స్టేషన్ (RR dist), Cyberabad Commisionarate. SI, CI లను తక్షణమే suspend చేయాల్సిందిగా నేరుగా DGP జితేందర్ గారిని కలిసి కోరడం జరిగింది.

విషయాల్లోకి వెళ్తే…
Barghav kumar అనే విద్యార్ధి పైన subba ratnam chinthapalli అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 05.02.2024 కొత్తూరు PS లో FIR నమోదైంది. తరువాత నేరవిచారణలో భాగంగా భార్గవ్ కుమార్ నుండి పోలీసులు Mobile phone అలాగే Laptop ను సీజ్ చేయడం జరిగింది. అయితే నేరవిచారణ భాగంలో నిందితుడి నుండి సీజ్ చేయబడిన ఎలాంటి వస్తువు/ డాక్యుమెంట్స్/ ఎలెక్ట్రానిక్ పరికరాలు విధిగా పోలీసులు సంభందిత కోర్టుకి చట్టపరంగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ కేసులో సీజ్ చేయబడిన వస్తువుల్ని తిరిగి ఇవ్వాల్సిందిగా Barghav kumar తరుపున ప్రముఖ High Court న్యాయవాది రాపోలు భాస్కర్ రిట్ పిటిషన్ వేయగా దానికి బదులుగా పోలీసులు వేసిన కౌంటర్ లో భాగంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హై కోర్టును కూడా ఉద్దేశ పూర్వకంగా తప్పు దోవ పట్టించి తాము ఎలాంటి laptop ను సీజ్ చేయలేదని చెప్పారు. అయితే కొంత కాలం తర్వాత Barghav kumar తన మెయిల్ ద్వారా microsoft account లో login అయ్యి దానికి సంభందించిన activity data ను పరిశీలించగా తన దగ్గర పోలీసులు సీజ్ చేసిన laptop లో కొత్తూరు PS కి సంభందించిన కేసుల పూర్తి సమాచారం అలాగే కొత్తూరు పోలీసు స్టేషన్ కి సభంధించిన ఒక అధికారి వ్యక్తిగత మరియు కుటుంభ సభ్యులకు సభంధించిన మరికొన్ని డాకుమెంట్స్ దొరికాయి. ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగించి వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించిన SI, CIలను తక్షణమే suspend చేయాల్సిందిగా న్యాయవాది జడ నవీన్ (ప్రముఖ High Court న్యాయవాది రాపోలు భాస్కర్ జూనియర్) రాష్ట్ర DGP జితేందర్ గారిని కలిసి కోరడం జరిగింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు