Friday, 7 August 2026

త్వరలో ఏపీ పర్యటనకు మోడీ?

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కేంద్రంతో రాష్ట్ర అభివృద్ధి పై చర్చిస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు మణిహారం లాంటి గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం రూపుదిద్దుకోనుంది. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టును పట్టాలెక్కించారు.

ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లినప్పుడు రక్షణమంత్రితో ఈ ప్రాజెక్టు పై చర్చించారు. గత అక్టోబర్ లో ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా కమిటీ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా (Krishna District) నాగాయలంక మండలం గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోడీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్డీఓ రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు