Friday, 7 August 2026

AP సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదం, అందులోనే డిప్యూటీ CM పేషీ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్ బిల్డింగ్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి SPF సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటన ప్రమాదశాత్తు జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. కావడంతో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ లోపల లేరని సమాచారం.

కాగా, సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ CM పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవదాయశాఖ మంత్రి ఆనం, మున్సిపల్ మంత్రి నారాయణ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు