Saturday, 8 August 2026

22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో వివాహం: అడ్డుకున్న భక్తులు

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో 22 ఏళ్ల యువతి, 42 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయబోతుండగా భక్తులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

పెళ్లి పీటలపై ఏడుస్తున్న పెళ్లి కూతురుని గుర్తించిన భక్తులు, భద్రతా సిబ్బంది ఆ యువతితో వాకబు చేయగా ఆమె తనకి ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నట్లు చెప్పింది. దాంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహాన్ని ఆపు చేసి, వధూ వరులు ఇరువురిని, పెద్దలని పోలీస్ స్టేషన్ కి తరలించారు. వివరాలు సేకరిస్తున్నారు.

ఇటీవలనే రాజమండ్రిలో ఓ స్త్రీ తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన భర్త పట్ల పెంచుకున్న అసంతృప్తితో తన పదో తరగతి క్లాస్మేట్ అయిన వ్యక్తితో మళ్లీ అనుబంధం పెంచుకుంది. ఈ క్రమంలో ఆ అనుబంధం వివాహేతర సంబంధంగా మారి, ఆ సంబంధానికి తన ముగ్గురు పిల్లలు అడ్డుగా వున్నారన్న భావనతో వారిని దారుణమగా హత్యచేసింది. ఇలాంటి వయసు వ్యత్యాసాలతో కూడిన అయిష్టపూర్వక వివాహాలకు ఇలాంటి ఉదంతాలు ఓ హెచ్చరిక.

స్త్రీలు అంతరిక్షంలోకి కూడా సాహస ప్రయాణాలు చేస్తున్న ఈ వైజ్ఞానిక యుగంలో కూడా ఆడపిల్లల్ని గుండెల మీద కుంపటిగా భావించే పురాతన వెనుకబాటుతనపు వ్యవస్థ అవశేషాలు కొనసాగడం దురదృష్టకరం. అయితే అన్నవరంలో పెళ్లి కూతురు ఆవేదనని అర్ధం చేసుకున్న భక్తులు, భద్రతా సిబ్బంది పెళ్లిని ఆపుచేయడం ముదావహం.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు