Friday, 7 August 2026

తొలిసారిగా రూ.3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్

పోయిన బడ్జెట్ రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్‌ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెరిగాయి. ఈసారి రూ.48,340 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్ రూ. 43,402.33 కాగా ఈసారి కేటాయింపులు భారీ స్థాయిల పెరిగాయి. మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు గతంలో ఇది రూ. 32,712 కోట్లుగా ఉంది. ఈసారి ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు ఉండొచ్చని అంచాన వేసింది.

అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు కేటాయించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కేటాయించారు. అలాగే జలవనరుల అభివృద్ధి బడ్జెట్ రూ.16,705 కోట్ల నుంచి రూ.18,020 కోట్లకు పెరిగింది.

బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి వరుసగా గతంలో రూ.18497 కోట్లు, రూ.7557 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు ఎస్సీలకు రూ.20,281 కోట్లు, ఎస్టీ సంక్షేహానికి రూ.8,159 కోట్లకు చేరాయి. ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లను కేటాయించింది. ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు, మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించింది.

పాఠశాల విద్యకు గతంలో రూ. 29,909కోట్లు ఈసారి కేటాయింపులు రూ.31,806 కోట్లకు చేరాయి. గత బడ్జెట్‌లో పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు కాగా ఈసారి రూ.3,156 కోట్లు కేటాయించారు. యువజన, సాంస్కృతిక శాఖకు గతంలో 322కోట్లు కాగా ఈమారు రూ.469 కోట్లకు పెంచారు. పోలవరానికి రూ.6,705 కోట్లు కేటాయించారు.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొ్న్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పులనే కాదు.. చెత్తను వారసత్వంగా ఇచ్చిందని అన్నారు. చెత్త పన్ను వేయడమే కాకుండా.. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండానే వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. తెలుగు భాషాభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయింపులు చేపట్టిన విషయాన్ని వెల్లడించారు. కాలుష్య రహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు