Friday, 7 August 2026

మాకు పోస్టులు ఇవ్వడం లేదు అంటూ బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి

శుక్రవారం విజయవాడలో ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని బీజేపీ శాసనసభా పక్షం అభిప్రాయపడింది. సంకీర్ణంలో ఉన్నాం కాబట్టి సమస్యలను జాగ్రత్తగా డీల్చే యాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని నేతలు తెలిపారు.

దేవస్థానం కమిటీలల్లో జరిగే నియామకాల్లో బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. కూటమి కాబట్టి ఈ విషయాన్నీ చర్చించి దేవస్థానం కమిటీల్లో బీజేపీ నేతలను నియమించాలని కోరాలి అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కాబట్టి విమర్శలుగా కాకుండా సలహాలు రూపంలో ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దేవస్థానం పాలక వర్గాల్లో బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించాలంటూ ఎంఎల్ఏలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దుగ్గుబాటి పురందేశ్వరికి విజ్జప్తి చేశారు.

ఈ సమావేశానికి ఎంపీ సీఎం రమేష్‌, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, సుజనా చౌదరి, పార్థసారథి, ఎన్ ఈశ్వర రావుతదితరులు హాజరయ్యారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు