Friday, 7 August 2026

తెలంగాణ ప్రభుత్వానికి బీవైడీ కంపెనీ బిగ్ షాక్ ఈవీ ప్లాంట్‌ ఏర్పాటుపై రివర్స్ గేర్?

రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ BYD బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్‍ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలను BYD కంపెనీ ఖండించింది. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది.

BYD సంస్థ ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ఇక్కడ సొంత ఉత్పత్తి యూనిట్ లేదు. ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేసిన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల అధిక సుంక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో, భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా BYDతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఈ కథనాలు సంస్థ దృష్టికి వెళ్లటంతో, ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది.

BYD హైదరాబాద్‌‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని సుమారు రూ.70 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. BYD కంపెనీ పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఈ కంపెనీ హైదరాబాద్‌కు వస్తే, దేశీయ EV రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కూడా అందరూ ఆలోచించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు