Friday, 7 August 2026

హిందీ నేర్చుకుంటే తప్పేముంది: చంద్రబాబు నాయుడు

కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన త్రిభాషా సూత్రం పై, ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్ కోసం ఉద్దేశించిన సాధనమని అన్నారు చంద్రబాబు. మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ ను, దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీని నేర్చుకుంటే తప్పేంటని అన్నారు చంద్రబాబు. జ్ఞానాన్ని సంపాదించడం మాతృభాష ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతానన్న చంద్రబాబు ఇతర భాషలు కూడా నేర్చుకోవడంలో తప్పులేదని అన్నారు.

ఇదిలా ఉండగా డీలిమిటేషన్ పై కూడా స్పందించిన చంద్రబాబు.. తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు. దేశ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ ఎంతో అవసరమని, ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన కూడా దేశ ప్రయోజనాలకోసమేనని అన్నారు చంద్రబాబు.

నియోజకవర్గ పునర్విభజన అత్యవసరమని, దేశంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై చర్చను తొలిసారి తానే ప్రారంభించానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. సరిహద్దు నిర్ధారణ నిరంతర ప్రక్రియ అని, ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని, సరిహద్దు విభజన, జనాభా నిర్వహణ భిన్నమైనవని అన్న చంద్రబాబు స్టాలిన్ వైఖరిని ఖండించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు