Friday, 7 August 2026

నటుడు చిరంజీవికి “Bridge India” అందిస్తున్న “Life Time Achievement Award”

మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవప్రదమైన గుర్తింపు! రేపు (19వ తేదీ) Bridge India అనే Non-Profit Organization ఆయనకు UK Parliament House of Commons‌ buiding లో Life time Achievement Award ప్రదానం చేయనుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఇప్పటికే London చేరుకున్నారు, అక్కడ London Heathrow విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

కళారంగంలో చేసిన అపూర్వమైన సేవలకు, సినీరంగంలో ఆయన అందించిన అజరామరమైన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయబడుతోంది.

ఇప్పటికే చిరంజీవి భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం Padma Vibhushan స్వీకరించగా, అంతకుముందు Padma Bhushan కూడా అందుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన Dance విభాగంలో Guinness Book of World Records నుండి ప్రత్యేక సర్టిఫికేట్ పొందారు. నాలుగున్నర దశాబ్దాల Cinema ప్రస్థానంలో చిరంజీవి చూపించిన ప్రభావం, ప్రజాదరణ, Charisma – ఇవన్నీ ఆయన గొప్పతనాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.

నటుడిగా మాత్రమే కాకుండా, మానవతా పరమైన సేవల్లోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన Chiranjeevi Blood & Eye Bank ద్వారా వేలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. Blood Donation, Eye Donation వంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి, మరెందరికో కొత్త ఆశను అందించారు.

ఈ గుర్తింపు చిరంజీవిగారికి మరిన్ని బాధ్యతాయుతమైన పాత్రలు, అలాగే భవిష్యత్తులో మరింత సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రేరణ ఎటువంటి సందేహం లేదు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు