Tuesday, 4 August 2026

ఒక సమస్యను తమకు అనుకూలంగా కాకుండా వ్యతిరేఖంగా ఎలా చేసుకోవాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య

తిరిగి అధికారం కల్ల అని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. వాళ్ళు పనిచేశే విధానం చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. తిరిగి గెలవాలి అనుకునే పార్టీ నాయకత్వం పనితీరు ఒక విధంగా ఉంటుంది. ఇంక గెలవం అని అనుకునే పార్టీ నాయకత్వం ఒక విధంగా ఉంటుంది.

400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల విషయాన్ని గమనిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భూమి అమ్మడం వలన వచ్చే డబ్బు వలన జరిగే మేలుకన్నా ఇప్పుడు వచ్చిన చెడ్డపేరు ఎన్నో రెట్లు ఎక్కువ. రేపటి రోజున ప్రభుత్వానికి భూములు అమ్ముకోవటానికి అన్ని క్లియర్ కావొచ్చు అయితే వచ్చిన నెగటివిటి చెడ్డపేరు పోదు.

ఈ విషయాన్నీ అనుభవం ఉన్న సీఎం, పార్టీ నాయకులు అయితే కొంచెం జాగ్రత్తగా డీల్ చేశే వాళ్ళు. ఇవి రెండు లేని దుందుడుకు నాయకత్వం అనుభవలేమి క్లియర్ గా కనిపిస్తోంది. భూములు అమ్మాలి అనుకున్నప్పుడు దానికి వ్యతిరేఖంగా పార్టీలు పెద్దగా స్పందించలేదు. కాని యూనివర్సిటీ విద్యార్థులు స్పందించడం మొదలు అయిన తరువాత అందరు లైన్ లోకి వచ్చారు.

భూముల అమ్మకం గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల స్పందనను అంచనా వేయకపోవడం ప్రభుత్వం బలహీనతను అహంకారాన్ని సూచిస్తుంది. సీఎం అసెంబ్లీలో అడవిలో జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అని అహంకారంగా మాట్లాడడం అనేది సహజంగా ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తుంది.

సీఎం అలా అన్నందుకు జంతవుల వీడియోలు మిగతా ఫోటోలు అన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసిన ప్రతి ఒక్కరు అయ్యో ఇవన్నీ ఉన్నాయి పాపం కదా అంటూ ఆ భూముల గురించి ఆరాతీయడం మొత్తం సంఘటనను హైలైట్ చేసింది.

కాసింత అనుభవం ఉన్నవాళ్లు అయితే యూనివర్సిటీ విద్యార్థులతో ప్రభుత్వం తరుపున ఓ కమిటీ వేసి వాళ్లతో చర్చించి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసి అక్కడ ప్రభుత్వం ఏం చేయాలి అనుకుంటున్నది వాళ్లకు చెప్పి ఉంటే అప్పుడు బాల్ యూనివర్సిటీ విద్యార్థుల కోర్టులో ఉండేది.

ఇదేదీ చేయకుండా సెలవు రోజులు చూసి జెసిబిలను గుంపులు గుంపులుగా పంపి చెట్లను నరకడం మొదలు పెట్టింది. ఇప్పడు అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ చెట్లు నరికే జెసిబి డ్రైవర్స్ వీడియోలు ఫోటోలు తీసి కూడా పంపవచ్చు. డ్రోన్స్ తో తీసిన ఫోటోలు మొట్టమొదట సోషల్ మీడియాలో హైలైట్ అయ్యి పెద్ద ఎత్తున సానుభూతిని కలుగచేశాయి. యుద్దానికి వెళ్లినట్లు వెళుతున్నారు, అడవిని నాశనం చేస్తున్నారు, జంతువులు ఏడుస్తున్నాయి అనే విషయాలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి.

ఇవి జరుగుతుంటే పార్టీలు తప్పక ఎంటర్ కావలసి వచ్చింది. తెరాస వేగంగా స్పందించింది. ఏకంగా తాము అధికారంలోకి వస్తే ఆ భూములు ఎవరైనా కొంటే తిరిగి తీసుకుంటాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది రేపు ఈ భూములు కొనే వాళ్ళను కూడా డిఫెన్స్ లో పడేసింది. అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఆలోచించేలా చేసింది.

ఇదంతా హైకోర్టుకు వెళ్లడం, సుప్రీం కోర్టుకు వెళ్లడం స్టే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములు అయినంత మాత్రాన మాకు ఇస్టమొచ్చినట్లు చేస్తాం అంటే కుదరదు అనే విషయం చెప్పించుకోవలసి వచ్చింది. ఒక సమస్యను తమకు అనుకూలంగా కాకుండా వ్యతిరేఖంగా ఎలా చేసుకోవాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనేది మరోసారి రుజువు చేసుకుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు