Friday, 7 August 2026

డాక్టర్ బూట్లు ఎత్తుకెళ్లాడు…

బంజారాహిల్స్ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. వైద్యుడి గదిలోకి వచ్చిన ఓ ఆగంతకుడు అక్కడ ఉన్న బూట్లను ఎత్తుకెళ్లాడు. పంజగుట్ట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజీగూడ, యశోద ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు డాక్టర్లు వినియోగించే బీ1 సెల్లార్ నుంచి లిఫ్ట్లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడ ఓ వైద్యుడి గదిలో డాక్టర్ కు చెందిన డ్రెస్సింగ్ రూమ్ నుంచి రూ. 15 వేల విలువ చేసే షూస్ను తస్కరించాడు. ఆస్పత్రి సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తి బీ1 సెల్లార్ నుంచి ఐదో అంతస్తుకు వెళ్లి డాక్టర్ డ్రెస్సింగ్ రూమ్ లో షూస్ తొడుక్కుని అక్కడి నుంచి నడిచి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన అతను రాజభవన్ వైపు నడిచి వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

చిల్లర దొంగ పనే;
సూర్యాపేటకు చెందిన మహేష్ (22) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చిన అతను సోమాజీగూడలోని దక్కన్ ఆస్పత్రిలో పని చేస్తూ ఇక్కడే హాస్టల్లో ఉండేవాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న యశోద ఆస్పత్రి సిబ్బందితో పరిచయాలు పెంచుకుని తరచూ వచ్చి పోతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నేరుగా ఆస్పత్రి ఐదో అంతస్తుకు వెళ్లి వైద్యుడి డ్రెస్సింగ్ రూమ్ షూస్ దొంగిలించి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి గదిలో సోదాలు చేయగా ఒక ఐ-ఫోన్, ట్యాబ్లో పాటు షూస్ స్వాధీనం చేసుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు