Friday, 7 August 2026

విమానంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి

ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల వృద్ధుడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మూర్చలోకి జారుకుని, నోటి నుండి నురగ రావడంతో తోటి ప్రయాణికులు ఆందోళన చెందారు. సరిగ్గా అదే సమయంలో.. అదే విమానంలో ప్రయాణిస్తున్న నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు, మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి వెంటనే స్పందించారు.

ప్రమాదాన్ని గుర్తించిన డాక్టర్ ప్రీతి రెడ్డి తక్షణమే వృద్ధుడి వద్దకు చేరుకున్నారు. ఆయనను పరీక్షించి పల్స్ బలహీనంగా ఉండటంతో పాటు రక్తపోటు కూడా బాగా తగ్గిపోయిందని నిర్ధారించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆమె వెంటనే కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR ) చేయడం ప్రారంభించారు. డాక్టర్ ప్రీతి రెడ్డి వెంటనే స్పందించడం.. ఆమె వృత్తి కూడా వైద్యం కావడంతో కొద్ది నిమిషాల్లోనే వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు. ప్రాథమికంగా ప్రమాదం తప్పడంతో తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు