Saturday, 8 August 2026

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు.

నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన ఛార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ ఎంపీలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లతోపాటు ఆ పార్టీ విదేశీ విభాగం చీఫ్ Sam Pitroda పేరును చేర్చింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడం ఇదే తొలిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో సంబంధమున్న మనీ ల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ సోమవారం ప్రశ్నించింది. ఈ ఘటన చోటు చేసుకొన్న కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీన జరపాలని ఈడీ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.

2012లో నేషనల్ హెరాల్డ్‌పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)ను స్వాధీనం చేసుకున్నారని.. తద్వారా దీని నుంచి రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్, శ్యామ్ ప్రిటాడో, సుమన్ దూబే తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అంతేకాదు.. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా AJL ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. ఈ విచారణలో ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే విషయంలో కోర్టు తన అభిప్రాయం వ్యక్తం చేయనుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు