Friday, 7 August 2026

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు తెలుగువారు ప్రాణాలుకోల్పోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో మృతి చెందినవారు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలానికి చెందిన టేకులపల్లి వాసులైన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)లు అప్పటికప్పుడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారును రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు. రోహిత్ రెడ్డి గత 15 సంవత్సరాలనుండి అమెరికాలో నివాసం ఉంటున్నారని బంధువులు తెలిపారు. ఆదివారం రోహిత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి బయటకువెళ్లారు. భార్యాపిల్లలతో పాటు అత్త సునీతతో కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ప్రణీత, ఆమె కొడుకు హార్వీన్, సునీతలు స్పాట్ లోనే చనిపోయారు. కారునడుపుతున్న రోహిత్ రెడ్డితోపాటు చిన్నకుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంవిషయం తెలిసినవెంటనే ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. కాగా, ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు