Friday, 7 August 2026

మామను చంపిన అల్లుళ్ళు సహకరించిన కూతుళ్లు- ఎటు వెళ్తోంది సమాజం ??

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ నెల 17న జరిగిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ ఆధిపత్యం కోసం కూతుళ్లు, అల్లుండ్లు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను SP నరసింహ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్కు ఐదుగురు కూతుళ్లు. ఇందులో రెండో అమ్మాయిని తప్ప మిగతా వారందరినీ అదే గ్రామానికి చెందిన వ్యక్తులకు ఇచ్చి పెండ్లి చేశాడు. చక్రయ్య గౌడ్ గతంలో సర్పంచ్ గా పనిచేయడంతో గ్రామంలో మంచి పలుకుబడి ఉంది.

తన మూడో కూతురు సునీతను సర్పంచ్ గా అల్లుడు కనకటి వెంకన్నను PSCS చైర్మన్ గెలిపించుకున్నాడు. అయితే తాము పదవుల్లో ఉన్నప్పటికీ గ్రామంలో పలుకుబడి మాత్రం చక్రయ్యకే ఉండడంతో అల్లుడు వెంకన్న పగ పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బొడ్రాయి వార్షికోత్సవంలో సైతం చక్రయ్యే పెత్తనం చేయడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా మామ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య సునీతతో పాటు ఆమె తోబుట్టువులు స్వరూప, కనకటి కల్యాణి వారి భర్తలు ఉప్పలయ్య, లింగయ్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు.

వీరికి మరో కూతురు అల్లుడు జక్కి స్వరూప, పరమేశ్ సహకరించారు. ఈ నెల 17న బంధువులు, కుటుంబసభ్యులు మరికొందరితో కలిసి కర్రలు, గొడ్డళ్లతో చక్రయ్యపై దాడిచేసి హత్యచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయగా హత్య కేసులో మొత్తం 40 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో ఆరుగురు ఇటీవల తుంగతుర్తి కోర్టులో లొంగిపోగా మరో ఆరుగురిని ఈ నెల 20న, ఏడుగురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కనకటి శ్రవణ్, కనకటి లింగయ్య, కనకటి ఉప్పలయ్య, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేశ్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ తో పాటు చక్రయ్య గౌడ్ కూతుళ్లు, అల్లుండ్లు ఉన్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు SP తెలిపారు.

పోలీసుల తీరుపై మొదట విమర్శలు: చక్రయ్యగౌడ్ హత్య కేసులో పోలీసుల వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కేసులో ప్రధాన నిందితులు కోర్టులో లొంగిపోయేలా పోలీసులు సహకరించారని చక్రయ్య కుటుంబసభ్యులు, అనుచరులు ఆరోపిస్తూ నిరసనలు తెలిపారు. కేసును పక్కదారి పట్టించారని, ఇందుకు లక్షల రూపాయలు చేతులు మారాయని కుటుంబసభ్యులు తుంగతుర్తి MLA మందుల సామేలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి చర్యలు తీసుకోవాలని CM రేవంత్ రెడ్డిని కోరారు. దీంతో చక్రయ్య హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వారం రోజుల్లో నిందితులను పట్టుకున్నారు. హత్య విషయం పసిగట్టలేకపోయిన DSP రవి,CI,SIలకు మెమోలు జారీ చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు