Thursday, 6 August 2026

థంబ్ నెయిల్స్ తో కుటుంబాన్ని బాధించారంటూ iDream Mediaపై గాయత్రి భార్గవి ఆరోపణలు

నటి, యాంకర్ అయిన గాయత్రి భార్గవి ఒక రీల్ చేసి తన యూట్యూబ్ చానెల్లో పెట్టారు. సారాంశం ఏమిటంటే తాను iDream Media తరపున వచ్చిన ప్రముఖ యాంకర్, జర్నలిస్ట్ స్వప్నకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చానని, ఆ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందని, ఇంటర్వ్యూలో భాగంగా ఆర్మీలో పనిచేస్తున్న తన భర్తకు ఎదురైన సెన్సిటీవ్ అనుభవాల గురించి చెప్పానని, ఆ క్రమంలో తాను ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నానని, అయితే iDream Media వాళ్లు ఇంటర్వ్యూని అప్లోడ్ చేసే క్రమంలో తన కుటుంబం మొత్తాన్ని డిస్టర్బ్ చేసే థంబ్ నెయిల్స్ పెట్టారని ఆమె ఆరోపించారు. తన భర్త మంచులో కూరుకుపోయి అక్కడే చనిపోతే, ఆయన బాడీని ముక్కలు ముక్కలు చేసి తన ఇంటికి పంపారనే థంబ్ నెయిల్ పెట్టారని, తాను ఏడుస్తున్న ఫోటోలు పెట్టారని, ఇది తన కుటుంబాన్ని డిస్టర్బ్ చేసిందని, కనుక iDream Media తగు వివరణ ఇవ్వటంతో పాటు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె వీడియోకి సమాధానంగా యాంకర్ స్వప్న మాట్లాడుతూ తన పని ఇంటర్వ్యూ చేయడం వరకేనని, మిగతాదంతా టెక్నికల్ టీం చూసుకుంటుందని, తన దృష్టికి వచ్చిన తప్పుడు థంబ్ నెయిల్స్ ని సరి చేయిస్తున్నానని, అయినా ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు మునుపు గాయని సునీత విషయంలో కూడా జరిగిందని, అయినా తానిప్పుడు iDream Media లో పనిచేయటం లేదని ఆమె వివరించారు.

మెయిన్ స్ట్రీం మీడియాలో లేని స్వేచ్ఛ సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ చానెళ్ల ద్వారా జర్నలిజం ప్రాక్టీస్ చేసే ఇండిపెండెంట్ జర్నలిస్టులకి వుంటుంది. ఆ స్వేచ్ఛని పాజిటీవ్ గా వాడుకుంటే సమాజానికి మంచే జరుగుతుంది. అయితే వ్యూయర్స్ సంఖ్య పెంచుకోవడం కోసం వారిని వెంటనే ఆకర్షించాలి కనుక అవాస్తవాలు, అసత్యాలతో కూడిన సంచలనాత్మక థంబ్ నెయిల్స్ పెట్టడం ఎక్కువైంది. తీరా థంబ్ నెయిల్స్ కి ఆకర్షితులై ఆ యూట్యూబ్ వీడియోలు చూస్తే థంబ్ నెయిల్ కి, సమాచారానికి సంబంధం వుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అనైతికం, దిగజారుడుతనం. ఇలాంటి పెడధోరణుల్ని కొనసాగనివ్వని స్పష్టమైన చట్టాలు తయారవ్వాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి ఇది వ్యతిరేకమైనప్పటికీ ఇలాంటివి కొనసాగుతున్నాయంటే అది యూట్యూబ్ వైఫల్యంగానే చెప్పాలి. యూట్యూబ్ ఇలాంటి వక్రమార్గాలను సహించకూడదు. వ్యూయర్స్ కూడా సంచలనాత్మక థంబ్ నెయిల్స్ కి కొట్టుకుపోకుండా తిరస్కరించగలిగితే ఈ పెడధోరణి రూపుమాసిపోతుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు