Friday, 7 August 2026

హైద్రాబాద్ నగరంలో దారుణ సంఘటన :జర్మనీ యువతిపై క్యాబ్‌ డ్రైవర్ల లైంగిక దాడి?

హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్వదేశానికి వెళ్లేందుకు బయలుదేరిన జర్మనీ యువతికి లిఫ్ట్‌ ఇస్తామంటూ క్యాబ్‌ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, జర్మనీకి చెందిన ఓ యువతి శుభకార్యానికి హాజరయ్యేందుకు మార్చి 4న నగరానికి వచ్చింది. అప్పటి నుంచి నగరంలోనే ఉన్న యువతి, మార్చి 31న జర్మనీ వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అదే రోజు రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వెళ్లేందుకు అమీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మండమల్లమ్మ క్రాస్ రోడ్‌లో క్యాబ్ కోసం ఎదురుచూస్తుంది.

అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఓ క్యాబ్ డ్రైవర్ ఎయిర్ పోర్ట్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో యువతిని ఎక్కించుకున్నాడు. అప్పటికే కారులో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎయిర్ పోర్ట్‌కి వెళ్లేదారిలో మధ్యలో కారు నిలిపివేసి యువతిపై ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిని అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. బాధితురాలు స్థానికుల సహాయంతో పహాడిషరీఫ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు CC కెమెరాల్లో నమోదైన విజువల్స్ ద్వారా క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు