Friday, 7 August 2026

పసిడి ప్రియులకు శుభవార్త…

బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. వరుసగా మూడోరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 540 తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్త. ఈ రోజు (ఫిబ్రవరి 28) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో.. వివరంగా చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.540 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ.500, రూ.540 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ 86,840 వద్ద ఉంది.

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ.79750 (10గ్రా 22 క్యారెట్స్), రూ.86,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 28) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.97,000 వద్ద ఉంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు