Friday, 7 August 2026

ఆశాలకు వరం….

ఆశా వర్కర్లకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు ఎప్పటినుంచో కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతివారూ గ్రాట్యుటీకీ అర్హులవుతారు. వారికి రిటైర్మెంట్‌ తర్వాత రూ.1.50 లక్షలకు వరకూ లబ్ధి చేకూరుతుంది. అలాగే, ఆశా వర్కర్ల పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. ఈ వరుస నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే 37,017 మందికి, పట్టణ ప్రాంతంలో పని చేసే 5735 మందికి లబ్ధి చేకూరనుంది. ఆరోగ్యశాఖపై శనివారం జరిగిన సమీక్షలో భాగంగా చంద్రబాబు ఈ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టయింది. పైగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవనుంది.

ఉద్యోగ విరమణ వయస్సును అప్పట్లో 60 ఏళ్లకు పెంచిన ఆయన.. తిరిగి ఇప్పుడు దానిని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్య పెన్షన్‌ పొందేందుకు ఆశాలకు అర్హత కల్పించారు. నెలకు రూ.10 వేలు చొప్పున జీతం చెల్లిస్తున్నారు. వీరికి ఉత్తరప్రదేశ్‌లో రూ.750, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.2 వేలు, రాజస్థాన్‌లో రూ.2,700, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీలో రూ.మూడు వేలు, హరియాణా, కర్ణాటకలో రూ.4 వేలు, కేరళలో రూ.5 వేలు, తెలంగాణలో రూ.7,500 చొప్పున ఇస్తున్నారు. కాగా, ఆశా వర్కర్ల పదవీవిరమణ వయసును పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ హర్షించారు. ఈ నిర్ణయం ఆరోగ్య రంగంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆశా వర్కర్లకు గ్రాట్యూటీని అందిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రా నిలవనున్నదని తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు