Saturday, 8 August 2026

దేవరపల్లి బాలిక హత్య కేసు, కోర్టు సంచలన తీర్పు

పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో, బుధవారం న్యాయస్థానం (Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా చోడవరం న్యాయమూర్తి ప్రకటించి, మరణశిక్షను ఖరారు చేశారు. చోడవరం కోర్టు చరిత్రలో మొదటి సారి ముద్దాయికి ఉరిశిక్ష విధించింది. దేవరాపల్లికి చెందిన గుణశేఖర్ (31)కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి K.రత్నకుమార్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి మరణశిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచడం ఇదే ప్రథమం.

గుణశేఖర్ కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు స్కూల్‌కు వెళ్లి వస్తున్న బాలికకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి గుణశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా విచారణ జరిగి ఈ రోజు న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగిందని అంతా భావిస్తున్నారు.

వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు ఉపాధి కోసం అనకాపల్లి జిల్లా వచ్చారు. గొల్లపేట వీధి, దేవరపల్లి గ్రామంలో హోటల్ను నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె వేపాడు దివ్య. వయస్సు ఏడేళ్ళు, స్థానికంగా ఉన్న ఉషోదయ స్కూల్లో UKG చదువుకుంటుంది. తాము నిర్వహిస్తున్న హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారి అలియాస్ తంబిని పనికి కుదుర్చుకున్నారు. గుణశేఖర్ పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉండడంతో, అతని ప్రవర్తనతో విసిగి వేసారిన ధనలక్ష్మి, మురుగన్ దంపతులు గుణశేఖర్ ను పనిలో నుండి తొలగించారు. దీంతో అవమానంగా భావించిన గుణశేఖర్ కక్షకట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అవకాశం కోసం ఎదురుచూసాడు. మురుగన్ ధనలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె చిన్నారి దివ్య హత్యకు ప్లాన్ చేశాడు. అతి కిరాతకంగా చంపేశాడు. నిందితుడు గుణశేఖర్పై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు నమోదు అయిఉంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు