Friday, 7 August 2026

HCU లో శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ పోలీసులు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. HCU క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేశారు. విశ్వవిద్యాలయం ద్వారాలన్నిటిని పోలీసులు బారిగేట్లతో మూసివేశారు. మరోవైపు, భూముల వేలానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇంకొవైపు, అక్కడ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే విధించినప్పటికీ, కోర్టు ఆర్డర్‌ కాపీలు అందలేదంటూ అర్ధరాత్రి వరకూ పనులు కొనసాగాయి. మొత్తానికి బుధవారం HCU క్యాంపస్‌ రణరంగాన్ని తలపించింది.

HCU భూములను ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం మౌనంగా ఉంటూ, ప్రభుత్వానికి సహకరిస్తుందని ఆరోపిస్తూ విద్యార్థులు అర్థరాత్రి వరకు అడ్మినిస్ట్రేషన్‌ భవనం ముందు ఆందోళన చేపట్టారు. భూముల పరిరక్షణ కోసం తమతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలని కోరుతూ అందజేసిన మెమొరాండంపై యూనివర్సిటీ యాజమాన్యం మౌనంగా ఉండటంతో అక్కడే బైఠాయించారు.

యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆందోళన కొనసాగించారు. యూనివర్సిటీ భూములను తిరిగి అప్పగించి, యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. విద్యార్థులు లాఠీదెబ్బలు తింటున్నా యాజమాన్యానికి కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ ఆందోళనకు యాజమాన్యం కూడా మద్దతు తెలపాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

HCU క్యాంపస్‌ను పోలీసులు బుధవారం అష్టదిగ్బంధం చేశారు. విశ్వవిద్యాలయం ద్వారాలన్నిటిని బారిగేట్లతో మూసివేశారు. క్యాంపస్‌ దరిదాపులకు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసు బలగాలను మోహరించారు. ఒక్కో గేటు వద్ద పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి, లోపలివారు బయటకు, బయటివారు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈస్ట్‌ క్యాంపస్‌ వైపు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి, అటువైపు విద్యార్థులు వెళ్లకుండా కట్టడి చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు