Friday, 7 August 2026

హోళి వేడుకల్లో గంజాయి కలిపిన కుల్ఫీ, ఐస్క్రీమ్స్…

హైదరాబాద్: హోలీ ముసుగులో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారుచేసిన కుల్ఫీ ఐస్క్రీమ్స్ తో పాటు గంజాయి బాల్స్ ను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హోలీ అంటేనే రంగుల పండుగ. ఒళ్లంతా రంగులు చల్లుకొని హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఇలా హోలీ రంగుల్లో ఆటపాటలతో నగర ప్రజలు ఎంజాయ్ చేస్తుంటే లోయర్ ధూల్పేట్ లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్క్రీమ్ గంజాయి, బర్ఫీ స్వీటులో గంజాయి, సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి వినియోగిస్తూ ధూల్పేట్ లో సంబరాలు జరుపుకుంటున్నట్లు ఎక్సెజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు సమాచారం అందింది.

ఎస్.టి.ఎఫ్.ఏ టీం లీడర్ అంజిరెడ్డి గ్రూపులోని ఎక్సెజ్ పోలీసులు, గంజాయి ముసుగులో జరుగుతున్న హోలీ వేడుకలపై దాడులు చేశారు. గంజాయితో తయారుచేసి వినియోగిస్తున్న కుల్ఫీ ఐస్క్రీమ్, బర్ఫీ స్వీటును, సిల్వర్ కోటెడ్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం కుల్ఫీ ఐస్క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకొని అమ్ముతున్న సత్యనారాయణపై కేసు నమోదుచేసినట్లు అంజిరెడ్డి చెప్పారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు