Wednesday, 5 August 2026

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు: ఏపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్

హైడ్రా ఏకంగా రూ. 2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది హైడ్రా. ఈ ఆపరేషన్‌లో భాగంగా కొండాపూర్‌లోని హఫీజ్‌పేట్‌లో దాదాపు 17 ఎకరాల్లో ఉన్న భారీ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది శనివారం కూల్చివేశారు.

హైడ్రా కూల్చివేసిన భూములు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందినవి కావడంతో ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెందిన ఆస్తులను హైడ్రా కూల్చివేయడం ఇదే మొదటిసారి. అందులోనూ ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే భూముల్లో నిర్మించిన కట్టడాలను హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేయడం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హైడ్రా అధికారుల వివరాల ప్రకారం.. హఫీజ్‌పేట్‌లోని సర్వే నెంబర్ 79లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు 39 ఎకరాల భూమి ఉంది. ఇందులో 5 ఎకరాలు రైల్వే లైన్ల కోసం పోగా.. మిగిలిన 34 ఎకరాలు వసంత కృష్ణ ఆధీనంలో ఉంది. కొంత స్థలంలో విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించగా.. మిగిలిన 17 ఎకరాల ఖాళీ స్థలంలో కోనేరు మురళీకృష్ణకు చెందిన KMK సంస్థ భారీ షెడ్లను నిర్మించింది. ఈ షెడ్లలో సినిమా షూటింగ్‌లకు సంబంధించిన సామాగ్రి ఉంచారు. హైడ్రా అధికారులు ఈ 17 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదని.. ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని చెబుతున్నారు.

హైడ్రా అధికారులు రంగంలోకి దిగి.. వాణిజ్య షెడ్లను నేలమట్టం చేశారు. ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే, భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఫామ్ హౌస్ కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 79లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. కూల్చివేసిన నిర్మాణాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన కార్యాలయం కూడా ఉంది.

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫామ్ హౌస్‌తో పాటు కార్యాలయాన్ని నిర్మించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ నిర్మాణాలు చేపట్టారని, సర్వే నంబర్ 79లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అధికారులు వెల్లడించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు