Friday, 7 August 2026

హైడ్రాతో రియల్‌ రంగం విధ్వంసం

హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని విధ్వంసం చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని విధ్వంసం చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ పేరుతో పేద ఇండ్లను కూల్చి వాళ్లను అవస్థల పాలు చేశారని మండిపడ్డారు. హైడ్రాను తనకోసమే తీసుకొచ్చినట్లుగా జన్వాడలో తనకున్న భూమిపైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్ను పడిందన్నారు. తన ఇంటిని కూల్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేశారని ఆరోపించారు.

రూ.లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్టుతో ఢిల్లీకి డబ్బుల సంచులు పంపి తన కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణతో ఎవరికి లాభం కలుగతుందని ప్రశ్నించారు. దాని వల్ల ఎంత మంది రైతులు బాగుపడతారు? దానితో సృష్టించే సంపద ఎంత? మూసీతో పారే ఎకరాలెన్ని? దాని వల్ల ఎవరికి లాభం కలగుతుందని నిలదీశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుని ఉపాధి పొందారన్నారు. శంకరపల్లి పరిధిలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రియల్‌ భూముల ధరలు గణనీయంగా పడిపోయాయన్నారు. దీంతో ఎంతోమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నవారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు