Thursday, 6 August 2026

​అమెరికా రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని మృతి

గుంటూరులోని రాజేంద్రనగర్‌కు చెందిన వంగవోలు దీప్తి (23) కొన్నాళ్ల క్రితం టెక్సాస్‌లోని డెంటన్‌ సిటీలో University of North Texas లో MS చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై దీప్తి నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో దీప్తి తలకు తీవ్ర గాయమవ్వగా ఆమె స్నేహితురాలు స్నిగ్ధకు సైతం గాయాలయ్యాయి.

పెమ్మసాని సహకారంతో క్రౌడ్​ఫండింగ్, చికిత్స: అనంతరం దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సంప్రదించగా సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు. చంద్రశేఖర్‌ తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్‌ బాధిత కుటుంబానికి క్రౌడ్‌ ఫండింగ్‌ వచ్చేలా చూడాలని సూచించారు. ఆన్‌లైన్‌లో విరాళాల రూపంలో దాదాపు 80,000 డాలర్ల వరకు రాగా వాటిని చికిత్సకు వినియోగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. శనివారం నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్‌ తెలిపారు.

దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారి. తల్లి రమాదేవి గృహిణి. సోదరి శ్రీలక్ష్మి ఇంజినీరింగ్‌ రెండో సంవత్సర విద్యార్థిని. ఈ నెల 10 న తేదీన దీప్తితో ఫోన్‌లో మాట్లాడామని కానీ అవే మాతో మాట్లాడిన చివరి మాటలవుతాయని అనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండేదని, పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచిందని, అందుకే కొంత పొలం అమ్మి అమెరికా పంపించామన్నారు. ఆమె కోర్సు పూర్తవుతున్నందున గ్రాడ్యుయేషన్‌ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని అమెరికా రావాలని కోరిందన్నారు. ఇంతలోనే దీప్తి దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తుందని తండ్రి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీప్తి స్నేహితురాలు స్నిగ్ధ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు