Friday, 7 August 2026

అధికారులే అమ్మానాన్నలు.. ప్రజాప్రతినిధులే ప్రత్యేక అతిథులు..

అనాథ యువతికి అధికారులు, ప్రజాప్రతినిధులే అమ్మానాన్నలయ్యారు. చిరుప్రాయంలోనే బాలసదనానికి చేరి సిబ్బంది సంరక్షణలో పెరిగి, పెళ్లీడుకొచ్చిన యువతికి మేమున్నామంటూ కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెండ్లి పెద్దలై, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కళాభవన్‌ వేదికగా అంగరంగవైభవంగా వివాహాన్ని జరిపించారు.

ఆమెకు అధికారులే చదువు చెప్పించి, ఆలనాపాలనా చూశారు. ఇంటర్మీడియట్‌ అనంతరం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేసి ఇంటర్న్‌షిప్‌ చేస్తుండగా, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో వారు ఆ యువకుడు, కుటుంబసభ్యులతో మాట్లాడి పెళ్లి నిశ్చయించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌, జిల్లా జడ్జి, అధికారులు, టీఎన్జీవో నాయకులు తమవంతు సహాయసహకారాలు అందజేయడంతో మౌనిక వివాహం అత్యంత ఘనంగా జరిగింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు