Friday, 7 August 2026

KL Rahul దంపతుల ఫేక్ ఫోటో వైరల్ – AI మాయజాలం ఎక్స్‌పోజ్

క్రికెటర్ KL Rahul దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఈ వార్తని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సామాజిక మాధ్యమాల్లో సంతోషంగా పంచుకున్నారు. ఇంతవరకు బాగానే వున్నది. రాహుల్, అతియాలు తమ బిడ్డతో వున్నట్లుగా చెప్పబడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. అయితే ఈ ఫోటో ఫేక్ అని తేలింది. తమకి బిడ్డ పుట్టిందని ఆ జంట ప్రకటించిన కొన్నిగంటల్లోనే AI సహాయంతో రూపొందించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అచ్చం ఒరిజినల్ ఫోటోలా వున్న ఈ AI ఫోటోని రాహుల్ అభిమానులు విపరీతంగా షేర్ చేశారు.

అయితే ఈ ఫోటో ఫేక్ అని ఎలా బైటపడిందంటే రాహుల్ చాలా కాలంగా నెత్తిమీద జులపాలు పెంచుతున్నాడు. అమ్మాయి పుట్టిన తరువాత IPL మ్యాచ్ లో జులపాలతోనే కనిపించాడు. కానీ వైరల్ అయిన నకిలీ ఫోటోలో రాహుల్ మామూలు క్రాఫ్ తో వున్నాడు. “సైట్ ఇంజిన్” అనే AI డిటెక్టర్ టూల్ ఈ ఫోటో ఫేక్ అని తేల్చింది. చెప్పాల్సిన విషయం ఏమంటే గత నవంబర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు. ఆ తరువాత రెండు నెలలకి ఇలాంటి AI ఫోటోలు వైరల్ అయ్యాయి.

కొంతమంది సరదాకి చేసే ఇలాంటి ప్రయోగాలు కొన్ని సందర్భాల్లో వికటించి ప్రమాదకరంగా సంభవించొచ్చని, అందుచేత నెటిజన్స్ అప్రమత్తతతో వ్యవహరించి, వేరిఫై చేసుకునే ఫోటోల్ని షేర్ చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు