Friday, 7 August 2026

KTR కాన్వాయ్ లో ప్రమాదం…

కరీంనగర్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ పద్మజా కాలు విరిగింది. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు వెంటనే వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావోస్తుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా రజితోత్సవ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ సభను మార్చి 27వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించడమే కాకుండా.. ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా ఆదివారం బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు కరీంనగర్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్‌లో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది. కేటీఆర్ రాక సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పద్మజను బీఆర్ఎస్ కార్యకర్త వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆమె కాలు విరిగింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు