Friday, 7 August 2026

కేటీఆర్‌కు అహంకారం.. కిషన్‌రెడ్డికి కుళ్లు : రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌కు అహంకారం ఉంటే.. కిషన్‌రెడ్డికి కుళ్లు ఉందని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించిన ముఖ్యమంత్రి రూ.879.80 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులిచ్చి మంచి చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నా..

కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. తాము కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధాన మంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే.. కిషన్‌రెడ్డి తానే తెచ్చానంటూ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. వస్తే తన ఖాతాలోకి, రాకపోతే రేవంత్‌రెడ్డి ఏమీ చేయడంలేదని ఆరోపించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ‘‘నేను కష్టపడి మామునూరు ఎయిర్‌పోర్టుకు అనుమతులు తెస్తే తానే తెచ్చానని కిషన్‌రెడ్డి చెప్పుకుంటున్నారు. అలా అయితే మూసీ ప్రక్షాళనకు, మెట్రో విస్తరణకు, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాల పనులకు, పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి కేటాయింపులు, సమ్మక్క-పారక్క, సీతారామ సాగర్‌లకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది ఆయనేనని భావించాల్సి వస్తుంది’’ అని రేవంత్‌ అన్నారు. తాను కిషన్‌రెడ్డి ఒక సందర్భంలో కలిసి పనిచేశామని, ఆయన కంటే చిన్నవాడిని, జూనియర్‌ను అయిన తాను ఎదగడం ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం చేస్తున్న, చేసిన పనులను బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు మనఃసాక్షితో చూడాలని సీఎం రేవంత్‌ అన్నారు. 25.50 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, కేసీఆర్‌ ఎగవేసిన రైతుబంధు సాయం రూ.7,627 కోట్లు ఇచ్చామని, కోతలు లేకుండా విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. అలాగే 50 లక్షల మందికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌, బీసీ కార్పొరేషన్‌, ట్రైబల్‌ కార్పొరేషన్‌, మైనారిటీ కార్పొరేషన్‌లను పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధి పథకాలకు రూ.6 వేల కోట్లు అందజేస్తామని చెప్పారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు