Friday, 7 August 2026

మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి – రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్న L&T

L&T హైదరాబాద్‌ మెట్రో రైలు టికెట్‌ రేట్లు పెంచాలని రాష్ట్రప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు హైదరాబాద్‌ మెట్రో సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని L&T సంస్థ చెబుతోంది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని తెలుస్తోంది.

నగరంలో మొదటిదశ ప్రాజెక్టును L&T సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (PPP)లో 2012లో రూ.14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబరులో పూర్తిచేశారు. మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజూ 5.10 లక్షలకు చేరింది. కరోనాకు ముందు రోజుకు రూ.80 లక్షలకు పైగా L&T ఆదాయం సమకూర్చుకుంది. అయితే 2020లో కరోనా లాక్‌డౌన్‌తో మెట్రో కుదేలైంది. 2022 నుంచి క్రమంగా కోలుకున్నా నష్టాల ఊబినుంచి బయటపడలేదని చెబుతోంది. మెట్రో నిర్వహణలో రోజుకు సుమారు రూ.కోటిన్నర వరకు నష్టం వస్తున్నట్లు L&T అధికారులు తరచూ చెబుతున్నారు. ఆశించినవిధంగా ప్రయాణికుల సంఖ్య రోజుకు 6 లక్షలకు పెరగకపోవడం నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మెట్రోకు మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిందని, కనీసం టికెట్‌ చార్జీలు పెంచుకునే అవకాశం కల్పిస్తే కొంతైనా నష్టాలను పూడ్చుకుంటామని L&T కోరుతోంది. అయితే మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి సారించిన సర్కారు ఇప్పుడు కేంద్రానికి ఈ విషయం తెలియజేస్తే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. అంతేకాకుండా కాలుష్యరహితంగా నడిచే మెట్రోరైళ్లలో టికెట్‌ ధరలు అందుబాటులో ఉండాలని పెంచితే ప్రయాణికుల సంఖ్య పడిపోతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది.

నష్టాలు వస్తున్నాయని చెబుతున్న L&Tకి రవాణా ఆధారిత అభివృద్ధి (TOD Transit Oriented Development) కింద నగరంలో మరికొన్ని స్థలాలను లీజు కింద అప్పగించాలని చూస్తోంది. మాల్స్‌, షాపులు ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో నష్టాలను పూడ్చుకోవాలని వారికి సూచిస్తోంది. దీనిపై ఇటు HMR‌, అటు L&T వేచిచూస్తున్నట్లు సమాచారం. నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ప్రయాణ చార్జీటికెట్లు కనిష్ఠ ధర రూ.10, గరిష్ఠ ధర రూ.60 గా ఉంది. చార్జీల సవరణ జరిగితే మెట్రోలో కనిష్ఠ టికెట్‌ రేటు రూ.20, గరిష్ఠంగా రూ.80 వరకు పెరగనుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు