Friday, 7 August 2026

డ్రగ్స్ మత్తులో హీరోయిన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన మలయాళ నటుడు Shine Tom Chacko

మలయాళీ నటి Vincy Aloshious పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా సెట్స్ లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. కానీ అతడి పేరు వెల్లడించలేదు.

ఈ క్రమంలో మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు షైన్‌ టామ్‌ చాకో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. మరోవైపు డ్రగ్స్ తీసుకునే వారితో నటించనని విన్సీ అలోషియస్ ఇటీవల చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. దీని తర్వాత నటిపై సైబర్ దాడి కూడా జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ విన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అందులో ఒక ప్రముఖ నటుడు సినిమా సెట్‌లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని ఆ వీడియోలో విన్సీ చెప్పింది. ఇప్పుడు ఆమే షైన్‌ టామ్ చాకో డ్రగ్స్ మత్తులో అసభ్య ప్రవర్తించడని ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు మరోసారి విన్సీ వీడియో వైరల్‌గా మారింది.

విన్సీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇంతకు ముందే చెప్పారు. మాదకద్రవ్యాల వాడకానికి సంబంధించిన ఆరోపణల కారణంగా ఎక్సైజ్ కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాగా ఓ వీడియోలో సుత్రవాక్యం అనే సెట్ లో తనతో షైన్ టామ్ చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది విన్సీ. సినిమా షూటింగ్ సమయంలో అతను డ్రగ్స్ వాడుతున్నాడు. ఆ విషయం సెట్‌లో అందరికీ తెలుసు. అంతగా తెలియని వ్యక్తితో నటించడం, అతనితో కలిసి పనిచేయడం తనకు ఆసక్తి లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు విన్సీ చెప్పుకొచ్చింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు