Friday, 7 August 2026

మార్గదర్శిపై కేసు కొనసాగాల్సిందే: ఆర్బీఐ

ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లపై జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ కె. సుజన ధర్మాసనం విచారణ జరిపింది.

రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చట్టంలోని 45(ఎస్‌)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించినందుకు మార్గదర్శి కేసు ఎదుర్కోవాల్సిందేనని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌. రవిచందర్‌ వాదిస్తూ.. మార్గదర్శి హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎ్‌ఫ) కర్త రామోజీరావు మరణించినప్పటికీ కేసు విచారణ కొనసాగాలని తెలిపారు. ఒకవేళ తప్పుచేసినట్లు తేలితే మార్గదర్శి సంస్థ సెక్షన్‌ 58 (బీ) ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మార్గదర్శి తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. హెచ్‌యూఎఫ్ కర్త, కర్మ, క్రియ అన్నీ రామోజీరావే కాబట్టి ఆయన చనిపోయిన నేపథ్యంలో ఇక ఎవరిపైనా కేసు ఉండదని తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కేసు విచారణ చేపట్టడం వల్ల సమయం వృథా తప్ప ఏమీ ఉండదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పూర్తిస్థాయి వాదనల కోసం మార్చి 7కు కేసును వాయిదా వేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు