Friday, 7 August 2026

అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు: 8 మంది మృతి

ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు సంభవించింది. అధిక పేలుడు సామర్థ్యం కలిగిన మందుగుండు పదార్థాలు మంటల్లో చిక్కుకుపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు.. భారీ మంటలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం జరిగిందో వెంటనే తెలియక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాద ధాటికి 8 మంది మృతి చెందారని సమాచారం. కానీ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. బాధితుల్లో ఎక్కువమంది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు. గాయపడిన వారిని విశాఖ కెజిహెచ్ కి తరలించారు.

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అతి కష్టంగా అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతలతో మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను హోంమంత్రి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ప్రమాద స్థలాన్ని హోం మంత్రి అనిత సందర్శించనున్నారు. ఆమె ఆసుపత్రిలో క్షతగాత్రులను కూడా పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని మంత్రి లోకేష్ అన్నారు.

ఈ ఘటనలో మరణించిన వారి ఊకో కుటుంబానికి ప్రభుత్వం 15 లక్షల రూపాయిల పరిహారం ప్రకటించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు