Friday, 7 August 2026

16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ త్వరలో ప్రకటిస్తాం: మంత్రి లోకేష్

ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్‌ బడ్జెట్‌ పద్దులపై చర్చించారు. మెగా డీఎస్సీతో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

ఏపీ వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడను పూర్తిచేయాలంటే రూ.3వేల కోట్లు అవుతుందని తెలిపారు. మన బడి మన భవిష్యత్తు, ఉపాధి హమీ కింద దశలవారీ చేపడుతామని అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ఈ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. ప్రతి పాఠశాలలో ఈగల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అన్ని కాలేజీలకు, పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌లో స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాలు, మంచి విద్య అందించడంలో ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు.

117 జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారని మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వ నిర్వాకంతో 12 లక్షల మంది విద్యార్ధులు తగ్గిపోయారని చెప్పారు. దీనికి ఓ ప్రత్యమ్నాయంపై సభ్యులతో చర్చించాలని నిర్ణయించామన్నారు. మధ్యాహ్నం ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇన్ కంప్లీట్‌గా ఉన్న పనులన్ని పూర్తిచేస్తామని చెప్పారు. 117 జీవోకు ప్రత్యమ్నాయంగా తీసుకువచ్చే జీవో ఆధారంగా సభ్యుల సలహాలతో ముందుకు వెళ్తామని అన్నారు. నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయి ఇందులో నాణ్యత లేదన్నారని చెప్పారు. నాడు నేడుపై రిపోర్టు తీసుకుని యాక్షన్ తీసుకుంటామని అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

సీసీ టీవీలు, లైటింగ్ పాఠశాలల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. లెర్నింగ్ ఎక్స్ లెన్స్ ఆఫ్ ఏపీ కింద సీఎస్ఆర్ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా అయితే సీఎస్ఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారో అలా మనం కూడా చేద్దామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో నాల్గో ప్రశ్నను వైసీపీ సభ్యులు అడిగారు. వారికి సమాధానం ఇస్తానని డిప్యూటీ స్పీకర్‌ను మంత్రి లోకేష్‌ అభ్యర్థించారు. టీవీలో అయినా సభ్యులు సమాధానం చూసుకుంటారని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. టీవీలో చూడటం కాదు టీవీలు బద్దలు అవుతాయని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు