Friday, 7 August 2026

అమరావతి పై అపోహలు వద్దు: మంత్రి పి.నారాయణ

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అమరావతి రాజధాని అభివృద్ధిపై అనవసరమైన అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీర్ఘకాలిక దృష్టితో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు .​

అమరావతిలో ₹64,000 కోట్ల విలువైన 92 అభివృద్ధి పనులకు అనుమతి లభించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ పనుల్లో ₹45,000 కోట్ల విలువైన టెండర్లు గత రెండు వారాల్లో ఖరారు చేయబడ్డాయి . రాజధాని నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది .​

అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూ సమీకరణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి నారాయణ తెలిపారు. భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, అదనపు భూమి అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు .​

అమరావతి కోసం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమిని లాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సమీకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగబోతుందని వైసీపి మీడియా వార్తలు రాస్తున్న నేపథ్యంలో మంత్రి పి.నారాయణ ప్రకటన ప్రాముఖ్యతని కలిగివున్నది. రైతులు భయపడాల్సిన అవసరం లేదని, భూముల విలువ తగ్గుతుందనే అపోహలు వ్యాప్తి చేయవద్దని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు .​

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు