Friday, 7 August 2026

ప్రైవేటు బస్సు సడన్‌ బ్రేక్‌.. ఒకేసారి ఢీకొన్న నాలుగు వాహనాలు..

నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్‌ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున చిట్యాల సమీపంలోని పెద్దకాపర్తి వద్ద ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో వెనక వస్తున్న కారు.. బస్సును ఢీకొట్టింది. దానివెనుక వెస్తున్న కంటైనర్.. కారును ఢీకొట్టడంతో అది బస్సు కిందికి దూసుకెళ్లింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోకారు అదుపుతప్పి డివైడర్‌ను గుద్దింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రమాదం వల్ల హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు