Friday, 7 August 2026

ప్రధానమంత్రి ప్రైవేట్‌ సెక్రటరీగా యంగ్‌ IFS‌ అధికారిణి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్ (DOPT) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ నియామకాన్ని DOPT ఆమోదించింది. 2014 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (IFS) అధికారిణి నిధి తివారీ ఇప్పటివరకు పలు హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం, ప్రధాన మంత్రి కార్యాలయంలో (PMO) డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నిధి తివారీ 2022 నవంబర్ నుండి ఆ హోదాలో ఉన్నారు.

అంతకుముందు, విదేశాంగ మంత్రిత్వ శాఖలో, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా నిధి తివారీ సేవలు అందించారు. ఈ క్రమంలోనే, ఆమెను ప్రధాన మంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియమించారు. 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షలో నిధి తివారీ 96వ ర్యాంక్ సాధించారు. నిధి తివారీ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాకు చెందిన మెహముర్‌గంజ్.

ఇప్పటివరకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇద్దరు ప్రైవేట్ సెక్రటరీలు ఉన్నారు, అయితే మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియమించారు. 2023 జనవరి 6 నుండి PMOలో నిధి తివారీ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. PMOలో చేరడానికి ముందు, నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో సేవలు అందించారు. భారత్‌కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే PMOలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఆమెను తీసుకెళ్లిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు