Friday, 7 August 2026

ఒక్క రాంగ్ కాల్ – నాలుగు కోట్ల రూపాయిల బ్లాక్మెయిలింగ్ వసూలు!

ఒక రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయిన ఆమె నుంచి అతడు నాలుగు కోట్ల రూపాయలు, 800 గ్రాముల బంగారాన్ని కొల్లగొట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళను వేధింపులకు గురిచేసి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 39 ఏళ్ల B. అక్షయ్ కుమార్‌ను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తిరుపతిలో అరెస్టు చేసి విశాఖకు తరలించారు.

వివరాల్లోకి వెళితే, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 39 ఏళ్ల అక్షయ్ కుమార్ 35 ఏళ్ల పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళకు 2020లో ఒక కాల్ చేశాడు. ఆమె రాంగ్ కాల్ అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. అయినా, మళ్లీ మళ్లీ ఫోన్ చేసి ఆమె వ్యక్తిగత విషయాలను సేకరించి, ఆ విషయాలను SMSల ద్వారా ఆమెకు పంపేవాడు. తనతో ఫ్రెండ్షిప్ చేయాలని, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంతకుముందు తనతో మాట్లాడిన వాయిస్ రికార్డులు, ఇతర వ్యక్తిగత విషయాలను ఆమె భర్తకు, కుటుంబసభ్యులకు పంపిస్తానని బెదిరించేవాడు. కొద్దిరోజుల తర్వాత, తనకు రూ. 10 లక్షలు ఇచ్చితే కాల్ రికార్డింగ్స్ అన్నీ ఇచ్చేస్తానని చెప్పిన అక్షయ్ కుమార్, 2021 ఏప్రిల్ 30న విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఉన్న ఒక షాపింగ్ మాల్ వద్దకు డబ్బుతో రావాలని చెప్పాడు. దీంతో, డబ్బులు తీసుకుని ఆమె అక్కడికి వెళ్లింది. అక్కడ ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకుని, ఆమెను కారులో తీసుకెళ్లి విశాఖపట్నంలోని ఒక హోటల్ గదిలో బలాత్కారం చేశాడని, ఆ కూడా రికార్డ్ చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఆ వీడియోలతో బెదిరిస్తూ, దాదాపు రూ. 4 కోట్లు నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడని ఆమె పేర్కొంది.

అక్షయ్ వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. ఆ తర్వాత భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 23న మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేరం విశాఖలోనే జరిగిందని, అక్కడే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. నిందితుడి గత రికార్డు పరిశీలించినప్పుడు, పదేళ్లుగా అతను ఇలాగే పలువురిని బెదిరించి డబ్బులు, నగలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.

ఈ సంఘటన తెలియజేస్తుంది, తెలియని వారితో ఆన్లైన్ ఫోన్ స్నేహం ప్రమాదకరమని. అవతలి వ్యక్తి మోసం చేసే నైజం బయటపడిన వెంటనే ఆ స్నేహాన్ని కట్ చేయాలి. మోసగాళ్లు, దోపిడీదారులు తమ బ్లాక్మెయిల్‌ను సాధారణంగా నిజం చేయలేరు. వారు తమ బెదిరింపులను సాధారణంగా ఎప్పటికీ అమలు చేయరు, ఎందుకంటే అలా చేస్తే తామే బుక్కవుతారు. కనుక, బ్లాక్మెయిలర్స్‌ని మొదట్లోనే కట్ చేయాలి లేదా నిజాయితీగా ఇంట్లో వారికి తెలియచేసి వారి సహాయం తీసుకోవాలి. ఏది ఏమైనా ధైర్యాన్ని కోల్పోకుండా సిట్యుయేషన్‌ను జాగ్రత్తగా డీల్ చేయాలి.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు