Friday, 7 August 2026

PG College of Law (OU) ప్రిన్సిపల్ ను తక్షణమే మార్చాలి..

ఉస్మానియా యూనివర్సిటీ (OU) లోని విద్యార్థులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు, ఆయన OU Chancellor గా వ్యవహరిస్తుండటంతో, ఒక e-mail రాశారు. అందులో PG College of Law కు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడిని ప్రిన్సిపల్‌గా నియమించాలంటూ డిమాండ్ చేశారు.

ప్రస్తుత ప్రిన్సిపల్ డా. గుమ్మడి అనురాధ బాధ్యతలు చేపట్టిన తరువాత, “కళాశాలలో విద్యా ప్రమాణాలు దిగజారాయి, మేము న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తినందుకు మమ్మల్ని Target చేస్తున్నారు” అంటూ విద్యార్థులు ఆరోపించారు.

విద్యార్థుల ముఖ్యమైన డిమాండ్స్:

•అర్హత కలిగిన, సీనియర్ మరియు ప్రతిష్టాత్మకమైన విద్యా, నైతిక రికార్డుతో కూడిన ప్రొఫెసర్‌ను OU Basheerbagh లోని PG College of Law కు తక్షణమే ప్రిన్సిపల్‌గా నియమించాలి.

•ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ డా. గుమ్మడి అనురాధ ప్రొఫెషనల్ ప్రవర్తన మరియు అనైతిక పరిపాలనా విధానాలపై స్వతంత్రంగా ఉన్నత స్థాయి విచారణ జరపాలి.

•విద్యార్థుల హక్కులను కాపాడాలి – అందులో విద్యా ప్రవేశ హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, కళాశాల management వేధింపులు మరియు అధికార దుర్వినియోగం నుండి రక్షణ కల్పించాలి.

ఇంకా, విద్యార్థులు తమ లేఖను physical copy కూడా పోస్టు ద్వారా గవర్నర్ కు పంపనున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రిన్సిపల్ డా. గుమ్మడి అనురాధ మాజీ ఇల్లందు MLA గుమ్మడి నర్సయ్య గారి కుమార్తె అనే విషయం అందరికి తెలిసిందే.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు