Friday, 7 August 2026

కన్నుమూసిన ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి

గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి హైదరాబాద్ లో స్నేహపురి కాలనీలోని స్వగృహంలో ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి.

బ్రిటీష్ ప్రభుత్వం విధించిన తీవ్ర ఆంక్షలని ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయం మీద జెండా ఎగరేసిన నేరానికి కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులకు 1932 జూన్ లో కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ సంఘటనకి సౌత్ బార్దోలి తిరుగుబాటు అనే పేరు వచ్చింది. జైలుశిక్ష విధించినప్పుడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. అలా వారు కారాగారవాసం అనుభవిస్తుండగా కృష్ణభారతి జైల్లోనే జన్మించారు. కృష్ణుడిలా జైల్లో పుట్టినందుకు కృష్ణ అని, భారతదేశం ప్రతిబింబించేలా భారతి అని రెండుపేర్లు కలిసేలా కృష్ణభారతి అని ఆమెకి తల్లిదండ్రులు పేరు పెట్టారు. ఆమె తొలి పదినెలల బాల్యం కారాగారంలోనే గడిచింది. గాంధీగారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించినప్పుడు కృష్ణమూర్తి ఆయనకి కార్యదర్శిగా పనిచేశారు. పడమర విప్పర్రు గ్రామంలోని తమ మొత్తం ఆస్తిని స్వాతంత్ర్య పోరాట ఉద్యమానికే త్యాగం చేశారు కృష్ణమూర్తి దంపతులు.

అవివాహితగానే వున్న కృష్ణభారతి జీవితాంతం గాంధేయ విలువలతోనే జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందించడంతో పాటు దళితుల్లో విద్యావ్యాప్తికి కృషి చేశారు. 2022 జులైలో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని నరేంద్రమోది ఆమెని ప్రత్యేకంగా సత్కరించారు. ఆమెకి పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు